Monday, October 7, 2019

కిందుపడి మొక్కకుమీ కేశవా

కిందుపడి మొక్కకుమీ కేశవా
కెందమ్మి రేకుఁ గన్నుల కేశవా. IIపల్లవిII

కేలు చాఁచే వింతలోనే కేశవా రతి
కేలికి మాయాడకే రా కేశవా
గేలి సేసేవేల మమ్ము కేశవా నీ
కేలు నా చేత నున్నది కేశవా IIకిందుII

గెరసు దాఁటకు వోయి కేశవా మంకుఁ
గెరలించేవు వలపు కేశవా
గిరికుచము లివిగో కేశవా నీకు
గిరపు వెట్టు కున్నదాన కేశవా IIకిందుII

కిలకిల నవ్వనేల కేశవా నీకు
కెలని వారమా నేము కేశవా
గిలిగించి కూడితివి కేశవా నాతోఁ
గెలసేవు శ్రీవేంకటకేశవా IIకిందుII

No comments:

Post a Comment