Sunday, October 6, 2019

పరుస మొక్క టేకాదా పయిఁడిగాఁ జేసేది

పరుస మొక్క టేకాదా పయిఁడిగాఁ జేసేదిఅరయ లోహమెట్టున్నా నందుకేమీ. IIపల్లవిII

వనజనాభునిభక్తి వదలకుండినఁ జాలు
మనసు యెందు దిరిగినా మరియేమి

మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు

తనువెంతహేయమైనా దానికేమి. IIపరుసII


శ్రీ కాంతునామము జిహ్వఁ దగిలితే జాలు

యేకులజుఁడైనాను హీనమేమి

సాకారుఁడై నహరి శరణుచొచ్చినఁ జాలు

చేకొని పాపము లెన్ని చేసిననేమి. IIపరుసII


జీవుఁ డెట్టున్నా నేమి జీవునిలో యంతరాత్మ
శ్రీ వెంకటేశున కాచింతయేమి

యేవలనఁ బరమైన యిహమైన మాకుఁ జాలు

కై వశమాయ నతఁడు కడమలింకేమీ. IIపరుసII

No comments:

Post a Comment