Sunday, October 6, 2019

ఇటు గరుడని నీవెక్కినను

ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనఁ బగిలె. IIపల్లవిII

ఎగసినగరుడని యేపున 'ధా'యని
జిగిదొలఁక చబుకుచేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు
గగనము జగములు గడగడ వడఁకె. IIఇటుII

బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు గోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరువున నలుగడ దిరదిరఁ దిరిగె. IIఇటుII

ప ల్లించిననీపసిఁడిగరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీమహిమ-
వెల్లి మునుఁగుదురు వేంకటరమణా. IIఇటుII

No comments:

Post a Comment