Sunday, October 6, 2019

కొసరి నీతోఁ బెనఁగి గునిసి మోక్ష మడుగ

కొసరి నీతోఁ బెనఁగి గునిసి మోక్ష మడుగ
వెస నీబంట నింతే నీవే దిక్కు నాకు. IIపల్లవిII

బలిమి నీ బిడ్డఁడైన బ్రహ్మంతవాఁడనా
అల సముద్రుడు మామ యంత వాఁడనా
చలువైన నీ మఱఁది చంద్రునంతవాఁడనా
యెలమి నీతోఁ బుట్టిన యింద్రునంతవాఁడనా. IIకొసరిII

చనువున మీ తండ్రి కశ్యపునంతవాఁడనా
అనుజుఁ డైన లక్ష్మణునంతవాఁడనా
మనవికి మీ బావ ధర్మజునంతవాఁడనా
అనుఁగుఁ దాతయైన భీష్మునంతవాఁడనా. IIకొసరిII

మనికైన యల్లుఁ డభిమన్యునంతవాఁడనా
అనిరుద్ధుఁడు మనుమఁడంతవాఁడనా
ఘనుఁడ శ్రీవేంకటేశ కల్పించి నీ వాడించఁగా
పనిపూని మెలఁగేటి ప్రతిమను నేను. IIకొసరిII

No comments:

Post a Comment