Monday, October 7, 2019

వెదకెద నిను నే వేదము చెప్పఁగ

వెదకెద నిను నే వేదము చెప్పఁగ
హృదయములోననే యిరవు నీ కటా IIపల్లవిII

శ్రీనాథా పిలిచితిఁ బలుకఁగదే
పూని యన్నిటా నుందువటా
మానితముగ నామాట వినఁగదే
వీనుల సర్వము విందువటా IIవెదకెదII

పరమాత్మా తప్పక పొడచూపవే
తరుణవయసు మరుతండ్రివటా
పరగ మొక్కెదను పాదము చాఁచవే
సిరుల బ్రహ్మ పూజించినదే యటా IIవెదకెదII

గోవిందా నీ గుఱు తెఱిఁగించవే
వేవేలు మహిమల విభుఁడవటా
శ్రీ వేంకటేశా జిగి నలమేల్మంగ
కైవశమై మముఁ గాతువటా IIవెదకెదII

No comments:

Post a Comment