Monday, October 7, 2019

తప్పని బొంకని యట్టి దామోదరా నాకు

తప్పని బొంకని యట్టి దామోదరా నాకు
దప్పిదేర మో వియ్యవో దామోదరా IIపల్లవిII

తరితీపుమాట లెల్ల దామోదరా నీకు
తరుణులు నేరిపిరా దామోదరా
దరిచేరె సంకు నీచే దామోదరా నీవు
తరగరివె తగు దామోదరా IIతప్పనిII

తగులు వీరి పందేల దామోదరా నీ
తగవు లేల చెప్పేవు దామోదరా
దగదొట్టి పలికేవు దామోదరా వెను
తగిలితి విందాఁక దామోదరా IIతప్పనిII

తల యెత్తు మా ముందర దామోదరా నీ
తళుకుమోవి చూచి దామోదరా
తలకొని కూడితివి దామోదరా యింక
తలఁగకు శ్రీవేంకటదామోదరా IIతప్పనిII

No comments:

Post a Comment