ఇదివో మా యింట నేఁడు యింత సేసెఁ గృష్ణుఁడు
అదివో మా యింటాను అంత సేసెఁ గృష్ణుఁడు ॥పల్లవి॥
గంట వాఁ గకుండా నిండఁ గసవు దురిగి మా-
యింటివారు నిద్దిరించ నిల్లుచొచ్చెను
అంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను
గంట గణగణ వాఁగె గక్కన మేల్కంటిమి। ॥ ఇది॥
వొక్క రోలు దాపు వెట్టి వుట్టి యెక్కి అందుమీఁది -
చక్కెరెల్లా మెసఁగి మాచంటివానిని
వుక్కఁబట్టి వుట్టి మీఁద నునిచి రోలు దీసె
టొక్కి తా నెందున్నాఁడో చొప్పు ఇదే కంటిమి। ॥ ఇది॥
ఆవుల వెళ్ళవిడిచె నవి నేఁ దోలి తేఁ బోతే
నీవల దూడలఁ దెచ్చి యింటిలోఁ గట్టె
దావతి నింతా వెదకి తలుపు దెరచితేను
శ్రీవేంకటేశునిమాయఁ జిక్కి లోన నున్నవి। ॥ ఇది॥ ౨-౧౬౬
చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలను గుఱించి గోపికలు ఒకరొకరితో చెప్పుకుంటున్న సంకీర్తన ఇది।
ఇదిగో ఈరోజు మా యింట్లో యింత పని చేసాడు కన్నయ్య అని ఒక గోపిక అంటే ఇంకో గోపిక అదిగో మా యింట్లోకూడా కన్నయ్య అంత పని చేసాడే అంటుంది।--ఆ పనులేమిటో చరణాల్లో ఇలా వివరిస్తా డన్నమయ్య।
మొలగంట మ్రోగకుండా నిండా గడ్డిని కోసి మా యింటివారంతా నిద్రిస్తుంటే ఇంట్లోకి వచ్చాడమ్మా।అతన్నంటి కూడా వచ్చిన ఒక దూడ ఆ గడ్డిని మేస్తూ వుంటే మొలగంట గణగణా మని మోగిస్తే చటుక్కున మేల్కొన్నామమ్మా।
ఒక రోటిని దాపుగా పెట్టి వుట్టినెక్కి అందులోని చక్కెరనంతా తినడమే కాకుండా మా చంటోడ్ని ఆ వుట్టిమీదుంచి వదలిపెట్టేసి రోలు తీసేసాడోయమ్మా।ఈ కన్నయ్య ఎక్కడ దాగుకొనున్నాడో ఇప్పుడే చూడాలి।
ఆవుల్నన్నీ బయటకు వదలివేసాడు।వాటిని నేను తిరిగి తోలుకొచ్చి తేవటానికి పోతే దూడలన్నిటిని తెచ్చి యింటిలో కట్టాడమ్మా। దాహంతో నింతా వెదకి తలుపు తెరిస్తే శ్రీవేంకటేశుని మాయ! అన్నీ లోననే చిక్కుకొనున్నవి.

No comments:
Post a Comment