Sunday, October 6, 2019

బ్రహ్మ మొకటె పరబ్రహ్మ మొకటె పర

తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన. IIపల్లవిII

బ్రహ్మ మొకటె పరబ్రహ్మ మొకటె పర
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే IIతందII

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మింతా నొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ. IIతందII

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటునిద్రదియు నొకటే
మెండైన బ్రాహ్మణుఁడు మెట్టుభూమి యొకటే
ఛండాలుఁ డుండేటి సరిభూమిి యొకటె.IIతందII

అనుగుదేవతలకు అలకామసుఖ మొకటే
ఘనకీటపశువులకు కామసుఖ మొకటె
దినమహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుఁ బేదకును వొక్కటే అవియు.IIతందII

కొరలి శిష్టాన్నములు గొనునాఁక లొకటే
తిరుగు దుష్టాన్నములు దినునాఁక లొకటే
పరగ దుర్గంధములపైవాయువు నొకటే
వరుసఁ బరిమళముపై వాయువు నొకటే.IIతందII

కడఁగి యేనుఁగు మీఁదఁ గాయుయెండొకటే
పుడమి శునకము మీఁదఁ బొలయునెండొకటే
కడుఁబుణ్యులను పాపకర్ములను సరిఁ గావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే.IIతందII

No comments:

Post a Comment