భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేయం సదా IIపల్లవిఈఈ
కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా-
పటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకుల శింజితే నతం
చతులనతనాసముజ్జ్వలవిలాసం. IIభావII
నిరతకరకలితనవనీతం బ్రహ్మాది-
సురనికరభావనాశోభితపదం
తిరువేంకటాచలస్థిత మనుపమం
హరిం పరమపురుషం గోపాలబాలం. IIభావII
అన్నమయ్య సంకీర్తనలలో సాధారణంగా మూడేసి చరణాలు ఉంటాయి. కాని ఈ సంకీర్తనలో మాత్రం రెండు చరణాలు మాత్రమే ఉన్నాయెందుచేతనో. ఇది సంస్కృతభాషలో రచింపబడిన సంకీర్తన. అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.నాకు సంస్కృతభాషా పరిచయం బాగా తక్కువ.అయినా ఎలానో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.తప్పులను- పెద్దలు, తెలిసినవారూ- తెలియజేస్తే కృతజ్ఞుడిని. భావయామి=భావించుచున్నాను
గోపాలబాలం=బాలునిరూపంలో ఉన్న గోపాలుని
సదా=ఎల్లప్పుడూ
మనస్సేవితం=మనస్సుతో సేవించబడుచున్న
తత్ పదం=ఆ గోపాలబాలుని పదములను
చింతయ ఇయం=నేను చింతనచేస్తున్నాను
కటి=కటిప్రదేశము(నడుము భాగము)నందు
ఘటిత=ఉంచబడిన
మేఖలా=వడ్డాణముయందు
ఖచితమణిఘంటికా=తాపడము చేయబడ్డ మణులఘంటలయొక్క
పటల=సమూహమువిభ్రాజమానం=ప్రకాశితమగుచున్నది.
కుటిలపదఘటిత=వంకరగానున్నపదములయందుంచబడిన
శింజితే నతం=మువ్వలచప్పుడు(?),శింజితానతం అని ఉండవచ్చేమో అంటూ ఏమైనా అర్థమంత సరిగా దోపదు అని అథోసూచికలో సూచించారు.
చటులనటనా=నటనలతో చలించున్న
సముజ్జ్వలవిలాసం=సముజ్జ్వలమైన విలాసముతో కూడుకున్నది
నిరత=మిక్కిలి ఆసక్తికొన్న
కరకలిత=అరచేతియందలి
నవనీతం=వెన్నపూస
బ్రహ్మాదిసురనికరభావనాశోభితపదం =బ్రహ్మదేవుడు మొదలుగాగల దేవతల సమూహము చేత భావింపబడిన అందమైన పదములు
తిరువేంకటాచలస్థితమ్=శ్రీవేంకటాచలపర్వతమందున్న
అనుపమం హరిం=చక్కనివాడైన శ్రీహరిని
పరమపురుషం=పరమపురుషుడైన
గోపాలబాలం=గోపాలబాలునిని
భావయామి=భావించుచున్నాను.

No comments:
Post a Comment