Sunday, October 6, 2019

అన్ని మంత్రములు నిందే ఆవహించెను

అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశుమంత్రము IIపల్లవిII
నారదుండు జపియించె నారాయణమంత్రము
చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహమంత్రము
కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము
వేరె నాకుఁగలిగె వేంకటేశుమంత్రము IIఅన్నిII

రంగగు వాసుదేవమంత్రము ధ్రువుఁడు జపించె
నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును
ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె
వింగడమై నాకునబ్బె వేంకటేశుమంత్రము IIఅన్నిII

యిన్ని మంత్రములకెల్ల యిందిరానాథుఁడే గురి
పన్నినదిదియే పరబ్రహ్మమంత్రము
నన్నుఁగావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను
వెన్నెలవంటిది శ్రీవేంకటేశు మంత్రము. IIఅన్నిII

No comments:

Post a Comment