కడుపెంత తాఁగుడుచు కుడుపెంత దీనికై
పడనిపాట్లనెల్లఁ బడి పొరలనేలా IIపల్లవిII
పరులమనసునకు నాపదలు గలుగఁగఁ జేయు
బరితాపకరమైనబ్రదుకేలా
సొరిది నితరులమేలు చూచి సైఁపఁగ లేక
తిరుగుచుండేటికష్టదేహ మిది యేలా IIకడుII
యెదిరి కెప్పుడు జేయుఁ హితమెల్లఁ దనదనుచు
చదివిచెప్పనియట్టిచదువేలా
పొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు
సదమదంబై పడయు చవులు దనకేలాIIకడుII
శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక
జీవనభ్రాంతిఁబడుసిరులేలా
దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు-
త్రోవ లేఁగినదేహిదొరతనంబేలాIIకడుII 1-302
కడుపుకు తినడానికి తనకెంత(చాలా తక్కువ)కావాలి? దీనికోసమై పడరాని పాట్లన్నీ పడి పొర్లుతూ ఉండాలి.
ఇతరుల మనసుల కాపదలు కలుగజేయు పరితాపాన్ని కలుగజేసే బ్రతుకు ఎందుకు?
క్రమముగా ఇతరులమేలు చూచి సహించలేక తిరుగుతూ ఉండేటి కష్టదేహము ఇది ఎందుకు?
ఇతరులకు చేసే మేలెల్లా తనదే, తనకోసమే నని చదివి చెప్పని చదువు ఎందుకు?
ముప్పిరిగొను ఆశలో యెల్లప్పుడూ

No comments:
Post a Comment