అల్లనాఁడే కంటి వింటి నథోక్షజా
అల్లుకొంటి విని చెలుల నథోక్షజా। IIపల్లవిII
అందు నిందు నీ యిర వథోక్షజా
అందాలు చెప్ప వచ్చే వథోక్షజా
అందరు నెఱుఁగుదురు యథోక్షజా మాకు
నందుకొని బా సిచ్చే వథోక్షజా। IIఅల్లII
అంగడి మొక్కువారమా అథోక్షజా నీకే
యంగము యీ నడవడి యథోక్షజా
అంగజముద్రలు నించే వథోక్షజా నీ
యంగనలుఁ గాదనేరా యథోక్షజా। IIఅల్లII
అసరాదు గాక నిన్ను నథోక్షజా కడు
ననుకాయెఁ బ్రియములు అథోక్షజా
అనుఁగు శ్రీవేంకటాద్రి యథోక్షజా మమ్ము
ననిశముఁ గూడితివి యథోక్షజా। IIఅల్లII
No comments:
Post a Comment