Sunday, October 6, 2019

నీలోని మతకాలు నే నెఱఁగనా

నీలోని మతకాలు నే నెఱఁగనా
పోలించి సరివచ్చితే బొంకఁ జోట్లేవి. IIపల్లవిII

సొలవక మగవాఁడు చూచినయంతటిలోనె
తలఁపు దెలియనిది తరుణా యది
పలికినంతటిలోనె భావముఁ దెలియకున్న
నెలకొన్న యాటదాని నేరు పెల్లా నేది. IIనీలోనిII

యెదుట నిలిచితేనే యింగితాకారము లెల్ల
తుద నేర్పరచనిది తొయ్యలా యది
కదిసేయాసందిలోనే కలయిం చెఱఁగకున్న
దరాన మానినుల జాణతనమేది. IIనీలోనిII

చేముట్టి నంతటిలోనే శ్రీవేంకటేశ్వరుఁడ
నీమనసు గనకున్న నెలఁతా యది
కామించి కూడితివి యీకందు విట్టి దనకున్న
వేమరు మావంటివారివివేక మేది. IIనీలోనిII

No comments:

Post a Comment