Sunday, October 6, 2019

కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁగాక

కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁగాక
నేమాన నేమి చేసినా నెంజెరివి దీరునా IIపల్లవిII

పలుమారు మాటలాడి పడఁతుల వలపించి
యెలయించే రమణుని నేమి సేసేది(దే?)
పిలిచి పానుపుమీఁద బెనఁగఁగానే చన్నుల
నెలకొనఁ గుమ్మినాను నెంజెరివి దీరునా IIకోమII

నగుతా దగ్గరఁ దీసి నాలిసేసి యేఁచేటి
యెగసక్కెపు విభుని నేమి సేసేదే
మొగము చూడఁగానే ముంగురులు చుట్టి పట్టి
నిగిడి గోర గీరినా నెంజెరివి దీరునా IIకోమII

మట్టు మీరి నన్ను గూడి మరులుగొలిపినట్టి
యిట్టి శ్రీవేంకటేశ్వరు నేమి సేసేదే
గట్టిగా మోవియాని గంటిసేసి పలుమారు
నెట్టుకొని కొసరక నెంజెరివి దీరునా. IIకోమII౧౪-౧౭౦

నెంజెరివి=ఎదలోని తాపము

No comments:

Post a Comment