మోహంపురతిముదము ముద్దుఁజూపుల మదము
దేహంపు సొబగెల్లఁ దెలిపె సదమదము IIపల్లవిII
మించుమట్టెల గిలుకు మెరుఁగుగుబ్బల కులుకు
వంచుఁజూపుల చిలుకు వసివాడుఁబలుకు
మంచుఁ జెమటల తళుకు మనసులోపలి యళుకు
అంచుటధరపుబెళుకు అలమేఁటి జళుకు. II మోహంII
కరమూలములఁ గరఁగు కదలుఁబయ్యెద చెరఁ గు
సిరులచెలువపుమొరఁగు చెక్కుపై మరఁగు
గరగరికె తతులెరుఁగు ఘాతలంటిన తెరఁగు
గరిమెతో చెలియునికి కప్పురపుటరఁగు.II మోహంII
కలికితనముల పోగు కమ్మ దావులవేఁగు
వలపుతమకముల పరవశము పెనుజాగు
కలకంటిబాగు వేంకటపతికిఁ జెలరేఁగు
చెలియ సమరతుల మించిన వింతబాగు।II మోహంII
మోహముతోడి కలయిక యొక్క సంతోషము ముద్దు కురిసే చూపుల మదముతో నలిగిన శరీరముయొక్క ఎల్ల సొబగులను తెలిపినవట।
అతిశయించిన మట్టెల సవ్వడి, మెరుస్తున్న స్తనముల కులుకు,వంగదీయు చూపులనెడి బాణపు యలుగులు,వసివాడిన పలుకు,మంచువలె చల్లని చెమటబిందువుల తళుకు,మనసులోని యళుకు(?)(తడబాటు?),పెదవి అంచుల బెళుకు,అలముచున్న జళుకు(లు)(?)।
బాహుమూలముల చెమట,కదిలే పయ్యెద చెరగు,చెలువపు సిరుల వంచన,చెక్కుపై ఆశపడుట,అందమైన తతులు(?)ఎరుఁగు(?),దెబ్బలు తగిలిన విధము,చెలువునికి గొప్పదైన కప్పురంపుటరుగు।
కలికితనముల పోగు, కమ్మని చోటుల వేగు,ఎక్కువ జాగైన వలపుతమకముల పరవశము,కలకంఠి బాగు, వేంకటపతికి చెలరేగు,చెలియ సమరతులతో మించిన వంత బాగు।

No comments:
Post a Comment