చెప్పఁ గల బుద్దులెల్లాఁ జెప్పితి నీకు
నెప్పున నిట్లైతే మన్నించునే నీవిభుడు IIపల్లవిII
మంచిమాట లాడితేను మగఁ డు మోహించునే
వంచన గలిగితేను వసమైయుండునే
ముంచి శావలుసేసితే మొగమోట గలుగునే
మించి యీనేరుపుల మెలఁ గవే చెలియ IIచెప్పII
తన యిచ్చలో నుండితే దయతో రక్షించునే
మనసెఁ రిగి కూడితే మరిగుండునే
వినయమే సేసితే వేడుకతో లాలించునే
పెనఁ గక యీగుణాల బెరయవే చెలియ IIచెప్పII
నీవే పైకొంటేను నెమ్మది నిన్ను మెచ్చునే
యేవేళఁ బాయకుండితే యింపు వుట్టునే
శ్రీవేంకటేశుఁ డేలెఁ జిత్తము రా బ్రతుకవే
వేవేల కలమేల్మంగ వెలయవే చెలియ IIచెప్పII २२-310
ఈ కీర్తన కూడా చెలికత్తె అలమేల్మంగ తో అంటున్నదే।
నీకు నేను చెప్పగలిగిన బుద్దులన్నీ చెప్పాను।ఈ విధమైన ఉపాయంతో అయితే విభుడు నిన్ను మన్నిస్తాడు।
మంచి మాటలాడితే పెనిమిటి భార్యను మోహిస్తాడే।వంచన కలిగుంటే భార్యకు వశమై వుంటాడు।మునుకొని సేవలు చేస్తే మొగమోటపడివుంటాడు।యిటువంటి నేర్పులతో అలమేల్మంగను మెలగమని చెలి హితవు చెపుతుంది।తన అభీష్టము మేరకు మెలగితే దయతో రక్షిస్తాడే।తన మనసెరిగి కూడితే నీతోనే వుంటాడే।
వినయంగా వుంటే వేడుకతో లాలిస్తాడే।వివాదము లేకుండా యీ గుణాలతో మెలగమని అంటూంది చెలియ।
నెమ్మదిని నీవే పైకొంటే నిన్ను మెచ్చుకుంటాడే।ఎప్పుడూ విడవకుంటే నువ్వంటే యిష్టం పుడుతుందే।
శ్రీవేంకటేశ్వరుడు నిన్ను ఏలుకుంటాడు, ఆతని మనసుకు నచ్చేట్లుగా బ్రతుకవే।ఇలా ఎప్పటికీ ప్రకాశిస్తూ వుండమని చెలియ అలమేల్మంగనతో అంటూంది.

No comments:
Post a Comment