Sunday, October 6, 2019

ఎంత సింగారించేవే యేమే నీవు

ఎంత సింగారించేవే యేమే నీవు
కాంతుఁ డు వాకిట వచ్చి కాచుకున్నాఁడు IIపల్లవిII

చెలులకు వెడవెడ సిగ్గులే సింగారము
సెలవులకు నవ్వులే సింగారము
పలచని మోవికి పలుకులే సింగారము
కలికి కన్నులకును సొలపే సింగారము। IIఎంతII

చక్కని బొమ్మలకును జంకెనలే సింగారము
చెక్కులకు మురిపెమే సింగారము
వెక్కసపు గోళ్ళకు విసరులే సింగారము
చొక్కపు జవ్వనానకు సొంపులే సింగారము। IIఎంతII

కఱకు చన్నులకును కాఁ గిలే సింగారము
చిఱుఁ దొడలకు రతి సింగారము
మఱి యలమేలుమంగ మగఁ డు శ్రీవేంకటేశుఁ-
డెఱిగి నిన్నిట్టె కూడెనిదె సింగారము. IIఎంతII 22-130

ఆడవారికి ఏవేవి సింగారాలో అన్నమయ్య ఈ కీర్తనలో వర్ణిస్తున్నాడు।
చెలికత్తె అలమేలుమంగతో ఇలా అంటోంది।
ఇంకా ఎంత సింగారిస్తున్నావేమే నీవు, నీ భర్త వచ్చి వాకిట్లో నీ కోసం కాచుకొనున్నాడే।ఈ సింగారాలన్నీ అక్కరలేదు।
చెలులకు చిఱుచిఱు సిగ్గులే సింగారము। పెదాలకు నవ్వులే సింగారము।పలచనైన పెదవికి పలుకులే సింగారము।
కలికి కనులకు పరవశమే సింగారము।
చక్కని కనుబొమలకు బెదిరింపులే సింగారము। చెక్కిళ్ళకు మురిపమే సింగారము। బాగా పెరిగే గోళ్ళకు ఆడించి చూపించటమే సింగారము।అందమైన యవ్వనానికి వంపు సొంపులే సింగారము।
కఱకైన చనులకు కవుగలించుటే సింగారము।చిన్నవైన తొడలకు రతిక్రియే సింగారము।మఱి అలమేల్మంగను శ్రీవేంకటేశుడు కూడి వున్నాడిదే సింగారము.

No comments:

Post a Comment