Sunday, October 6, 2019

క్షితి నిట్టి నేరుపు సీతాదేవికిఁ గలిగె

క్షితి నిట్టి నేరుపు సీతాదేవికిఁ గలిగె
తతి తోడ దశరథ తనయుని యెడను IIపల్లవిII
పతి చిత్తమెరిఁ గి తప్పక వూడిగము చేసి
అతనినే తన దైవమని తలఁచి
సతమై యనేక వుపచారములఁ బోషించి
వ్రతము గైకొని యుండవలయు సతికినిIIక్షితిII

పరపురుషుఁ జూడక ప్రాణేశ్వరునే కోరి
సరవితో నతని ప్రసాద జీవియై
దొరసి యెడవాయక తోడు నీడయై యుండి
వరుస మీరక యుండవలయు సతికిని.IIక్షితిII

యెదురాడక శ్రీ వేంకటేశ్వరు కిందిరవలె
కదిసి యతని కిచ్చకముగ గూడి
అదనెరిఁగి యే పొద్దు నంకెకు లోనైవుండి
వదలక బత్తి సేయవలయు సతికిని.IIక్షితిII 

No comments:

Post a Comment