తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ
నెలఁ త భావంబెల్ల నీవెఱుఁగు దిఁకనూ IIపల్లవిII
నిలుచుఁ దలయూఁచుఁ గన్నీరు వాలిక గోళ్ళఁ
జినుకు నివ్వెఱఁగుపడుఁ జింతించును
పులకించు నలయుఁ దలపోయు నినుఁ జిత్తమున
నిలువునంగన విధము నీ వెఱుఁగు దిఁకను। IIతెలియII
కమలంబు చెక్కుతోఁ గదియించు నెన్నుదుట
చెమటఁ బయ్యెదఁ దుడుచు సెలవి నగును
తమకంపుఁ గోరికలు తరుణి యిదె నినుఁబాసి
నిమిష మోర్వఁగలేదు నీ వెఱుఁగు దిఁకను। IIతెలియII
వెక్కసపు నునుదురుము వెడవదల నేరదు
చిక్కుదేరఁగఁ గొంత సిగ్గు వడును
ఇక్కవలఁ దిరువేంకటేశ నినుఁ గూడె నిదె
నిక్కమీ చెలి వగల నీ వెఱుఁగు దిఁకనూ।IIతెలియII

No comments:
Post a Comment