Showing posts with label na. Show all posts
Showing posts with label na. Show all posts

Sunday, October 6, 2019

నీ నామమే మాకు నిధియు నిధానము

నీనామమే మాకు నిధియు నిధానము
నీనామమె యాత్మనిధానాంజనము IIపల్లవిII

నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదన
నమో త్రివిక్రమ నమో వామనా IIనీనాII

నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంరక్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్నతే నమో యనిరుద్ధా. IIనీనాII

నమో పురుషోత్తమ నమో యధోక్షజ
నమో నారసింహ నమోస్తు యచ్యుత
నమో జనీర్దన నమోస్తు ఉపేంద్ర
నమో శ్రీవేంకటేశ నమో శ్రీకృష్ణా. IIనీనాII

నారాయణా నీనామమె గతి యిఁక

నారాయణా నీనామమె గతి యిఁక
కోరికలు నాకుఁ గొనసాగుటకు. IIపల్లవిII

పైపై ముందట భవజలధి
దాపు వెనకఁ జింతాజలధి
చాపలము నడుమ సంసారజలధి
తేప యేది యివి తెగనీఁదుటకు. IIనారాII

పండె నెడమఁ బాపపురాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది. IIనారాII

కిందులోకములు కీడునరకములు
అందేటిస్వర్గా లవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీవేంకటేశ నీ -
యందె పరమపద మవల మరేది. IIనారాII

నానాటి బతుకు

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము IIపల్లవిII

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట కల దీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము. IIనానాII


కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము. II నానా II


తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక
గగనము మీదిది కైవల్యము. IIనానాII