Showing posts with label uu. Show all posts
Showing posts with label uu. Show all posts

Sunday, October 6, 2019

ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే

ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానఁ డింతేకాక. IIపల్లవిII

యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాఁ డు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల-
కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁ డింతేకాక. IIఉన్నII

యేమి విచారించి దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
దోమటిసంసారపుదొంతికర్మములఁ జిక్కి
కాముకుడై కిందుమీఁదు గాన డింతేకాక. IIఉన్నII

యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుండఁగా
భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
కావరాన నిన్నాళు కానఁ డింతేకాక. IIఉన్నII